వీరమల్లు లుక్ ను పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్..

Satvika
తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు మంచి రికార్డులను బ్రేక్ చేశాయి.. ఇప్పుడు వరుస రిమెక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండ గా, హిస్టారికల్ సబ్జెక్ట్‌ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.


ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది.  కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్త వుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటం తో ఈ సినిమా కోసం పవన్ గతకొంత కాలంగా ఒకే తరహా లుక్‌లో కనిపిస్తూ వచ్చాడు. భీమ్లా నాయక్ చిత్రం తరువాత వీరమల్లు లుక్‌లో పవన్ మనకు కనిపించాడు..


అయితే ఆ సినిమా పూర్తీ అవ్వక ముందే మరో సినిమా లో కనిపించారు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆ సినిమా లుక్ నుంచి బయటకు వచ్చినట్లు గా తెలుస్తోంది. తన లుక్‌ను పూర్తిగా మార్చేయడం తో పవన్ వీరమల్లు సినిమా షూటింగ్‌ లో ఇప్పట్లో పాల్గొంటాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా లో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, తమిళ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ప్రస్తుతం పవన్ రాజకీయాల లో చురుగ్గా ఉన్నారు.. వచ్చే ఎన్నికల లో జనసేనను నిలిపెందుకు పవన్‌ ప్రయత్నం చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: