టాలీవుడ్ హీరోలు ఆ పనికి ఒప్పుకోగలరా..?
హీరోల పారితోషకం పెంచడం అనే విషయం ఇప్పటిది కాదు దాసరి నారాయణరావు కూడా పదేపదే పలు వేదికలపై ప్రస్తావించినా కూడా పట్టించుకున్న నాధుడే లేకపోవడం చాలా బాధాకరమని చెప్పాలి. ముఖ్యంగా హీరో , దర్శకుల పారితోషకాలను చెల్లించలేక నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం నిర్మాతలు దీనిపై చర్చ సాగిస్తుండగా హీరోలు కాస్ట్ కంట్రోల్ ఉద్యమానికి సహకరించాలని , ఇక 25% పారితోషకం కూడా తగ్గించుకోవాలని కాల్ షీట్ల పరంగా కూడా నిర్మాతలకు సహకరించాలని త్వరలోనే ధర్మ యుద్ధం ప్రకటిస్తున్నారని కూడా టాకు వినిపిస్తోంది. కానీ దీనికి ఎవరు స్పందిస్తారు అనే విషయం కూడా ప్రశ్నగా మారడం గమనార్హం.
ఇకపోతే హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు రేమ్యునరేషన్ అదనంగా ఇవ్వడంతో పాటు ఆన్ లొకేషన్స్ సౌకర్యాలు రూపంలో బోలెడంత బిల్లు నిర్మాతల చేతికి వస్తోంది ఇక ఇదంతా భరించలేక నిర్మాతలు పాపం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లొకేషన్లో నటీనటుల లంచ్ క్యారేజీతో సహా ప్రతిదానికి కూడా నిర్మాతనే బాధ్యత వహించాలి. దీనికి తోడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా భారీగా పారితోషకాలు పెంచేస్తున్నారు. ఇక ఇదంతా చూసుకుంటే మన హీరోలు మాత్రం పారితోషకం తగ్గించుకోవడానికి ససేమిరా అనడం గమనార్హం .కానీ కొంతమంది హీరోలు మాత్రం నిర్మాతల కష్టాలను అర్థం చేసుకొని తమ పారితోషకాన్ని తగ్గించుకుంటున్నారు. అందరూ కూడా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే ఇండస్ట్రీలో ఇబ్బందులు తలెత్తవని బోగట్టా..