మనీ: రూ.50 డిపాజిట్ తో 30 లక్షలు మీ సొంతం..!!

Divya

సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగించింది ఇండియన్ పోస్ట్. పోస్ట్ ఆఫీస్ ప్లాన్స్ మీకు సురక్షితమైన పెట్టుబడిని అందించడమే కాకుండా రిస్క్ ఫ్యాక్టర్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి. ఇక సురక్షితమైన స్థలంలో పెట్టుబడి పెట్టడం వల్ల జీరో రిస్క్ తో కూడిన హామీ డబ్బులను మీరు పొందవచ్చు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న చిన్న ప్రభుత్వ పథకాలు మీకు ఒక బెస్ట్ ఆప్షన్ లాంటివి. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న చిన్న పొదుపు పథకాలలో మీకు ప్రత్యేకంగా అందించే మరొక పథకం గ్రామ సురక్ష పథకం.

ఇక ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అందించే ఈ సెక్యూరిటీ ప్లాన్ మీకు మంచి రాబడిని అందిస్తుంది. ఇక మీరు ఈ పథకాన్ని తీసుకుంటే ప్రతి నెల 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే రోజుకు 50 రూపాయలు చొప్పున ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు రూ.31 నుండి రూ.35 లక్షల వరకు రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడిదారుడి వయసు కనిష్టంగా 19 సంవత్సరాల నుండి గరిష్టంగా 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక కనీస మీరు మొత్తం రూ.10,000 నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది.

ఇకపోతే ప్రతినెల,  త్రైమాసికం,  అర్థ సంవత్సరం లేదా వార్షికంగా మీరు ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కల్పించారు ఇకపోతే ప్రీమియం చెల్లింపు కోసం మీరు 30 రోజులు తగ్గింపు కూడా పొందుతారు. అంతేకాదు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలకు మీరు రుణం కూడా పొందవచ్చు. ఇకపోతే ఎవరైనా 19 సంవత్సరాల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే 55 సంవత్సరాల వరకు ప్రతి నెల రూ.1515 .. అదే 58 సంవత్సరాలకైతే రూ.1463 అదే 60 సంవత్సరాల కైతే రూ.1411 అవుతుంది. ఇకపోతే 55 సంవత్సరాలు రూ.31.60 లక్షలు మీరు పొందితే 58 సంవత్సరాలకు రూ.33.40 లక్షలు అలాగే 60 సంవత్సరాలకు రూ.34.60 లక్షలు మీరు పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: