టాలీవుడ్ యంగ్
హీరో లలో ఒకరు అయిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
హీరో తన కెరియర్ లో
గుంటూరు టాకీస్ , మా వింత గాధ వినుమా ,
కృష్ణ అండ్ హిస్ లీలా వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించాడు.
ఈ
మూవీ లు పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయి. కాకపోతే ఈ సినిమాల ద్వారా సిద్ధు జొన్నలగడ్డ కు అదిరిపోయే రేంజ్ క్రేజ్ మాత్రం
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ లో
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
డీజే టిల్లు
మూవీ లో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అన్ని కూడా అదిరిపోయే రేంజ్ లో డిఫరెంట్ గా ఉండడం ఎక్కువగా యూత్
ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో ఈ
సినిమా సూపర్ విజయాన్ని సాధించి సిద్దు జొన్నలగడ్డ కు సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ సినిమాకు
విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా,
నేహా శెట్టి ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
డీజే టిల్లు
మూవీ సూపర్
సక్సెస్ ను సాధించడంతో తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...
డీజే టిల్లు
మూవీ నుండి దర్శకుడు
విమల్ తప్పుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.