గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తన హాట్ హాట్ అందచందాలతో , అద్భుతమైన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఆ తర్వాత గోవా బ్యూటీ ఇలియానా వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అనేక సినిమాల్లో నటించింది.
అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక తెలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియాన స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే చివరగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది. కానీ చివరకు ఆండ్రూ ... ఇలియానా లవ్ కి బ్రేకప్ అయిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలియానా మరో అబ్బాయితో ప్రేమలో పడింది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే... తాజాగా ఇలియానా , కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడికి ఇలియానా కూడా వచ్చింది. సెబాస్టియన్‌తో కలిసి ఇలియానా కబుర్లు చెబుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కత్రీనా కైఫ్ , ఇలియానా తమ ఇన్ స్టా లో పంచుకున్నారు. దాంతో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ , ఇలియానా లవ్ లో ఉన్నారు అంటూ ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.