టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్
హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న
హీరో అయిన డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో
టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక నిఖిల్ కథానాయకుడిగా వచ్చిన
కార్తికేయ చిత్రం హిట్ అయ్యి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో నిఖిల్ హీరోగా సీక్వెల్ గా 'కార్తికేయ 2' చిత్రం రూపొందింది.ఇక నిర్మాతలు
అభిషేక్ అగర్వాల్ అలాగే టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్
డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ కథ విషయానికి వస్తే పూర్తిగా ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరగనుంది. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 22వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రం ముందుగా ప్రకటించిన రోజున థియేటర్లకు రావడం లేదని తెలిపింది చిత్ర యూనిట్.అయితే ఆగస్టు నెల ఫస్టువీక్ లో విడుదల చేయవచ్చని కొన్ని రోజుల క్రితం
హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే ఇప్పుడు మేకర్స్ మనసు మార్చుకున్నట్టుగా ఒకవార్త బాగా షికారు చేస్తోంది. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీనే రిలీజ్ చేయాలనే వారు నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి పోటీగా
నాగ చైతన్య థాంక్యూ
మూవీ రిలీజ్ అవ్వబోతుందట. అందుకే ఈ
సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి
కీరవాణి తనయుడు
కాలభైరవ స్వరాలు సమకూర్చాడు. సినిమాలో నిఖిల్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అలరించనున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్,
ఆదిత్య మీనన్,
తులసి ఇంకా శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలలో కనిపించనున్నారు. చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఏ మేరకు
సక్సెస్ అవుతుందో చూడాలి మరి.