ఆ తమిళ హిట్ రీమేక్ లో రానా దగ్గుబాటి..?

Anilkumar
ఇటీవల
 తమిళ హీరో శింబు  'మానాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది.అయితే  ఇక ఈ సినిమాని తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.కాగా  ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. ఇకపోతే ఈ సినిమాపై శింబుకి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పోతే ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్‌ నటించింది. ఇదిలావుండగా ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ప్రకటించారు.


అయితే సురేష్‌ ప్రొడక్షన్స్ ఈ సినిమా రీమేక్‌ హక్కులతో పాటు, అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ ని కొనుక్కున్నారు.అంతేకాకుండ ఈ సినిమాని తెలుగులో నాగచైతన్య తో,అభితో ఇలా చాలామంది హీరోలతో అనుకున్నారు. అయితే కానీ చివరకు రానాతో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ మేరకు నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ తెలియచేసారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా రానా హీరోగా తెరకెక్కబోతుంది అని సమాచారం.అంతేకాకుండా  దర్శకుడిగా తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి.


ఇదిలావుంటే యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, హీరోగా శింబు - విలన్ గా ఎస్.జె. సూర్య ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇకపోతే విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, అక్కడి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది.కాగా  కెరియర్ పరంగా శింబూకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఎస్.జె. సూర్య విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసారు .ఇక ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరో పాత్రను రానా చేయనున్నాడనే టాక్ బయటికి వచ్చింది.అయితే  మరి విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.పోతే  తెలుగులో కూడా ఈ సినిమాను వెంకట్ ప్రభునే డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: