నిఖిల్ సినిమాకి రిలీజ్ కష్టాలు..?

Anilkumar
ఇటీవల  కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది హీరోల సినిమాల షూటింగులు డిలే అయ్యాయి అన్న సంగతి తెలిసిందే.అయితే ఇక అంతా సెట్ అయిన తర్వాత రిలీజ్ చేసుకోవడానికి సరైన రిలీజ్ డేట్లు దొరకడం లేదు.అయితే ఒకే రోజు క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అయితే జనాల పై ఒత్తిడి పెరిగినట్టు అవుతుంది.ఇక  మామూలుగానే జనాలు థియేటర్లకి రావడం తగ్గించారు. తాజాగా ఇప్పుడు రెండేసి సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళు రావాలనుకున్న సినిమాలకు మానేసే ప్రమాదం ఉంది.ఇక దీంతో ఇంకో సినిమాతో పోటీకి దిగడం కంటే వాయిదా వేసుకోవడమే బెటర్ అనే ఆలోచన కొందరి నిర్మాతల్లో ఉంది.


అయితే అందుకే కొంతమంది హీరోల సినిమాలు వాయిదా పడాల్సి వస్తుంది. ఇకపోతే ఈ లిస్ట్ లో నిఖిల్ ముందున్నాడు అని చెప్పాలి. అయితే పాండమిక్ తర్వాత చాలా వరకు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాగా నిఖిల్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.ఇదిలావుంటే  'కార్తికేయ 2' చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నారు..అయితే  కానీ దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' అదే రోజున రిలీజ్ అవుతుండడంతో 'కార్తికేయ2' టీం వెనక్కి వెళ్లారు.ఇదిలావుంటే ఆగస్టు మొదటి వారంలో 'కార్తికేయ2' రిలీజ్ అవుతుంది అంటున్నారు. అయితే కానీ అది కుదిరేలా లేదు.


ఇక నిఖిల్ 'గీతా ఆర్ట్స్' సెకండ్ బ్యానర్ అయిన 'జి ఎ 2 పిక్చర్స్' లో చేసిన '18-పేజెస్' మూవీ చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా రిలీజ్ కాలేదు.అయితే  ఒకానొక సమయంలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అన్నారు. ఇక  అలాంటిదేమి జరగలేదు.అయితే  సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అంటున్నారు.ఇక ఆ డేట్ కైనా వస్తుందో లేదో చూడాలి. ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న మరో మూవీ 'స్పై'. ఇదిలావుంటే దసరా కానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది అంటున్నారు.అయితే  కానీ దసరాకి 'గాడ్ ఫాదర్' 'ఘోస్ట్' వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే  ఆ మూవీ కూడా అనుకున్న టైంకి రావడం కష్టంగానే కనిపిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: