కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినా
సూర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
సూర్య ,
మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన
గజిని మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి ఆ
మూవీ తో
టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు .
ఆ తర్వాత నుండి
సూర్య తను నటించిన దాదాపు అన్ని
మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు
ఇండస్ట్రీ లో కూడా సూపర్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు . ఇలా తెలుగు లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న
సూర్య ఇప్పటి వరకూ తన కెరియర్ లో నేరుగా ఒక్క తెలుగు
మూవీ లో కూడా నటించ లేదు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆదుకున్న సమాచారం ప్రకారం త్వరలోనే
సూర్య నేరుగా ఒక తెలుగు
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది . తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినా యు
వి క్రియేషన్స్ బ్యానర్ వారు
సూర్య హీరోగా ఒక స్ట్రీట్ తెలుగు
మూవీ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ
మూవీ కి దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఎవరు అనేది ఇంత వరకు కన్ఫామ్ కానట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ కి దర్శకత్వం వహించే దర్శకుడి పేరుని మరియు ఇతర నటీ నటులు , సాంకేతిక నిపుణుల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.