ఉపాసన పుట్టినరోజున మెగా అభిమానుల హంగామ !

Seetha Sailaja

రామ్ చరణ్ అభిమానులు ఉపాసన ను ‘వదిన’ అని అభిమానంగా పిలుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే ఉపాసన కూడ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ చరణ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అదేవిధంగా అతడి సినిమా సంగతులను అభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. అంతేకాదు మెగా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అపోలో హాస్పటల్స్ లో మెగా అభిమానులకు తక్కువ రేటుకే వైద్య సహాయం అందేలా ఆమె నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది.


సాధారణంగా హీరోల పుట్టినరోజునాడు ఆహీరోల అభిమానులు హడావిడి చేయడం సర్వసాధారణం. అయితే రామ్ చరణ్ అభిమానులు మటుకు దీనికి భిన్నంగా నేడు ఉపాసన పుట్టినరోజు సందర్భంగా చాల హడావిడి చేస్తున్నారు. ఈరోజు మెగా ఫ్యాన్స్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ని కూడా డిజైన్ చేశారు.


‘శ్రీమతి కొణిదెల ఉపాసన గారి బర్త్ డే సెలిబ్రేషన్స్’ పేరుతో ప్రత్యేక ఇన్విటేషన్ ని ప్రింట్ చేయించారు. ఈరోజు ఉపాసన పుట్టినరోజు సందర్భంగా ఉదయం ప్రత్యేకంగా రామ్ చరణ్ - ఉపాసనల పేరు మీద ప్రత్యేక పూజాలు జరిపించబోతున్నారు. అంతేకాదు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహిస్తారట. ఆతరువాత అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేబోతున్నారు తెలుస్తోంది.


అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అవస్తలుపడుతున్న వారికి కావాల్సిన వస్తువులను అందించే ఏర్పాట్లు కూడ జరుగుతున్నాయి. టాప్ బిజినెస్ ఉమెన్ గా అనేక అవార్డులు అందుకున్న ఉపాసనకు సినిమాల పై విపరీతమైన క్రేజ్ ఉండటంతో అవకాశం దొరికినప్పుడల్లా ఉపాసన చరణ్ నటిస్తున్న షూటింగ్ ల వద్దకు వెళ్ళి అక్కడ సమయం గడపడం ఆమె హాబీ. అంతేకాదు బాలీవుడ్ లో చరణ్ ఇమేజ్ పెంచడం కోసం ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసి చరణ్ కు బాలీవుడ్ లో కూడ మంచి క్రేజ్ ఉండేలా ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: