యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల ఎంపికలో తనదైన మెచ్యూరిటీని చూపిస్తూ పెద్ద స్టార్ హీరోగా ముందుకెళ్తున్నాడు. అంతేగాక ఇతర హీరోల సినిమాలు బాగుంటే వాటిని మెచ్చుకోవడంలో కూడా తారక్ ఎప్పుడూ ముందుంటాడు.ఇక ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాలో భీమ్ పాత్రలో తన నటవిశ్వరూపాన్ని ఈ ప్రపంచానికి చూపించిన తారక్, ఇప్పుడు మరో హీరో, తన సొంత అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు అభయం ఇస్తున్నాడు.ఇక ఇంతకీ తారక్ కళ్యాణ్ రామ్‌కు ఏ విషయంలో అభయం ఇస్తున్నాడు.. అసలు ఈ మ్యాటర్ ఏమిటో ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందామా..!
నందమూరి పెద్ద వారసుడు నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక చాలా సతమతమవుతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలనే కసిలో ఉన్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే ఓ మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.ఇక 'బింబిసారా' అనే డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్.
ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ఇంకా త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రివ్యూను జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చూసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు అనేవి చెబుతున్నాయి.ఇక ఈ క్రమంలోనే బింబిసారా చిత్రాన్ని చూసిన తారక్, కళ్యాణ్ రామ్ అండ్ టీమ్‌ను చాలా అభినందనలతో ముంచెత్తాడట. వైవిధ్యమైన కథను ఎంచుకోవడం దగ్గర్నుండి, సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా కూడా అసలు మిస్ కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు చాలా పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని తారక్ ధీమా వ్యక్తం చేశాడట. ఇక కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాకే హైలైట్ కానుందని తారక్ మెచ్చుకున్నాడట. ఇలా తన అన్న నటిస్తున్న సినిమాకు తారక్ ఇచ్చిన రెస్పాన్స్‌తో కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ చాలా రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నారట. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగా రెడీ అవుతోంది.