మెగాస్టార్ మారుతి సినిమా అలా ఉండబోతుందా!!

P.Nishanth Kumar
మెగాస్టార్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి దిగిన సినిమా ఫోటో బయటకు వచ్చిందో అప్పటినుంచి వీరి కలయికలో సినిమా వస్తుందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అనేది తెలియాలి. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ మూడు చిత్రాల తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకపోవడం మారుతి ఒక్కడే లైన్ లో ఉండడం వంటివి జరుగుతూ ఉండడంతో చిరంజీవి తదుపరి సినిమా ఈయనతోనే అన్నట్లుగా అందరూ భావిస్తున్నారు.

కెరీర్ మొదటినుంచి చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు మారుతి. ఆ తరువాత పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఈ కాంబో గురించి ఎప్పుడైతే వార్తలు వస్తున్నాయో అప్పటినుంచి ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్లో ఉన్న సినిమా మొదలవుతుందో అన్న ఆసక్తి అందరిలో ఆసక్తి నెలకొంది. చిరంజీవి కోసం పక్కా మాస్ మసాలా కమర్షియల్  స్క్రిప్ట్ ని మారుతి రెడీ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. తప్పకుండా చిరంజీవికి ఇది ఒక మంచి సినిమా అవుతుందని కూడా మారుతి చెబుతున్నాడు.

ఇకపోతే ప్రభాస్ దర్శకత్వంలోని మారుతి సినిమా కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ డైరెక్టర్ ఇద్దరు భారీ హీరోలతో సినిమాలు చేయడం నిజంగా ఆయన అభిమానులకు సంతోషంగానే ఉన్నా కూడా ఆ చిత్రాలతో మంచి సక్సెస్ సాధిస్తే బాగుంటుంది అన్న భావన వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమాలతో మారుతీ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఒకటి మోహన్ రాజా దర్శకత్వంలోని గాడ్ ఫాదర్ సినిమా కాగా ఇంకొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలోని భోలా శంకర్ సినిమా. బాబీ దర్శకత్వంలోని వాల్తేరు వీరయ్య సినిమా ను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. మరి ఈ సినిమాలు ఏ స్థాయి లో ఆయనకు విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: