ఈ
మూవీ కి
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా లింగుసామి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ది
వారియర్ మూవీ జూలై 14 వ తేదీన తెలుగు మరియు
తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల కావడంతో ఈ
మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్ లు వచ్చాయి. కాకపోతే ఈ
మూవీ కి మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాక్సాఫీస్ దగ్గర తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది ఇలా ఈ
మూవీ లో మొదటి సారి తన కెరియర్ లో
రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం లింగుసామి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ
మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.
దానితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 34.10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ
సినిమా 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు 6 రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ది
వారియర్ మూవీ 15.93 కోట్ల షేర్ , 24.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇంకా 17.57 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది.