'మాచర్ల నియోజకవర్గం' మూవీ నుండి 3 అదిరిపోయే అప్డేట్ లను విడుదల చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
 


ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటిస్తూండగా ,  సముద్ర కని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ అంజలి కనిపించబోతోంది. ఇప్పటికే హీరోయిన్ అంజలి కి సంబంధించిన ఈ మూవీ లోని సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ లను స్టార్ట్ చేయబోతోంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మూడు అదిరిపోయే అప్డేట్ లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.  


మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి మూడవ సింగిల్ సాంగ్ 'అదిరిందే' ను జూలై 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు , జూలై 26 వ తేదీన మాచర్ల దంకి ని విడుదల చేయనున్నట్లు , అలాగే జూలై 29 వ తేదీన మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇలా మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ ప్రమోషన్ స్పీడ్ ను పెంచనుంది. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ తో నితిన్ ఈ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: