రిపోర్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్.. ఎందుకో తెలుసా?

praveen
ఏఎన్నార్ ఎన్టీఆర్ కాలంలో కథానాయకుల గురించి మాట్లాడుకుంటే ముందుగా వినిపించే పేర్లు సావిత్రి, జమున, అంజలిదేవి, చంద్రకళ వీరితో పాటు వాణిశ్రీ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న నందమూరి  తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది వాణిశ్రీ. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా వాణిశ్రీ  పోషించే పాత్రలు మాత్రం ఎప్పుడూ విభిన్నంగానే ఉండేవి అని చెప్పాలి. ధైర్యంగా గడుసుగా ఆత్మగౌరవం కలిగిన ఒక అమ్మాయి పాత్రలో ఎక్కువగా వాణిశ్రీ కనిపిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో కూడా మిగతా హీరోలతో పోలిస్తే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది అని చెప్పాలి.


 తన కెరియర్ లో దాదాపు 200 కు పైగా సినిమాలలో నటించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది వాణిశ్రీ. అయితే రెమ్యునరేషన్ కి ఆశపడకుండా కేవలం ఆమె ఆలోచనలకు తగ్గ పాత్ర వస్తేనే చేస్తాను అంటూ చెప్పేది. లేదంటే దర్శక నిర్మాతలు ముఖంమీద చేయను అంటూ అప్పట్లో చెప్పేదట వాణిశ్రీ. ఇలా చెప్పడం కారణంగానేనేమో ఎక్కువగా వాణిశ్రీ అంటే గడుసుది పొగరు ఎక్కువ గల హీరోయిన్ అంటూ అప్పట్లో నిర్మాతలు మాట్లాడుకునే వారట. అయితే ఇప్పటి లోనే కాదు అప్పట్లో కూడా హీరోయిన్ల పై రకరకాల రూమర్స్ వస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉండేవి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు ఒకానొక సమయంలో వాణిశ్రీ దగ్గరికి వచ్చి 50 వేల రూపాయలు ఇస్తే మీ గురించి పత్రికల్లో మంచిగా రాస్తానని.. లేదంటే లేనిది కల్పించి రాస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడట. అయితే రిపోర్టర్ అలా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వాణిశ్రీ  షూటింగ్ స్పాట్ కి రమ్మని చెప్పిందట. ఈ క్రమంలోనే అతని దగ్గరగా కూర్చోబెట్టుకుని ఎంతో ఓపికగా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఎంతో శాంతంగా చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదట.  కానీ అతను మాత్రం అలాగే వారించడంతో చేసేదేమీ లేక ఏకంగా అందరి ముందు చెప్పుతీసుకొని రిపోర్టర్ చెంపలు వాయించిందట.  దీంతో సదరు జర్నలిస్ట్  పరువు పోయింది అని అక్కడి నుంచి పారిపోయాడట. ఇలా వ్యక్తిత్వంతో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వాణిశ్రీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: