రామ్ చరణ్ తో త్వరలోనే ఒక భారీ సినిమా చేయబోతున్నాను... లోకేష్ కనకరాజు..!

Pulgam Srinivas
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో జోరుగా వినబడుతున్న దర్శకుల పేర్లలో లోకేష్ కనకరాజు పేరు ఒకటి. ఈ యంగ్  తమిళ దర్శకుడు మా నగరం మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. అదే సినిమాను తెలుగులో నగరం పేరుతో విడుదల చేయగా, ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.


ఆ తర్వాత లోకేష్ కనకరాజు , కార్తీ హీరోగా ఖైదీ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను తెలుగులో కూడా ఖైదీ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా తమిళ , తెలుగు రెండు భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తళపతి విజయ్ హీరోగా మాస్టర్ మూవీ ని తెరకెక్కింది. ఈ సినిమా కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యింది. మాస్టర్ మూవీ తో కూడా మంచి విజయాన్ని లోకేష్ కనకరాజు అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకున్న లోకేష్ కనకరాజు తాజాగా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా  తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలై సూపర్ విజయం సాధించింది.  విక్రమ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే విజయం సాధించడంతో లోకేష్ కనకరాజు పేరు ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమోగుతోంది.


మరి కొన్ని రోజుల్లో లోకేష్ కనకరాజు , తళపతి విజయ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేష్ కనకరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజు మాట్లాడుతూ...  నేను త్వరలోనే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాను. కొన్ని రోజుల క్రితమే ఆయనను కలిశాను. ప్రస్తుతం మేమిద్దరం కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి కాగానే రామ్ చరణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాను అని తాజాగా లోకేష్ కనకరాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: