రజినీ ఫస్ట్ తెలుగు సినిమా ఏదో తెలుసా?

Purushottham Vinay
సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే స్టైల్ కు కేరాఫ్. అందుకే ఈయన్ని తమిళ్ లో తలైవా ఇంకా ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అని అంటారు.ఇక ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన నటించిన సినిమా రిలీజ్ అయితే చాలు..జనాలు ఇక పండుగ చేసుకుంటారు.పేరుకి తమిళ్ హీరో అయిన కేవలం తమిళ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈయన ఫిల్మ్స్ కు చక్కటి స్పందన అనేది లభిస్తుందని అందరికీ తెలుసు.ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగునాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. ఇక ఆయన పోషించిన తొలి తెలుగు పాత్ర ఏమిటి? ఏ సినిమా? అనే విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో నటించిన తొలి చిత్రం 'అంతులేని కథ'. ఇందులో హీరోయిన్ జయప్రదకు అన్నగా 'మూర్తి' అనే తాగుబోతు పాత్ర పోషించాడు రజినీ కాంత్.ఇక తాగుడు అలవాటున్న వ్యక్తిగా, తన చెల్లెలి సంపాదనపైన ఆధారపడి బతికే వ్యక్తిగా సినిమాలో కనిపిస్తాడు.


ఓ సంఘటన కారణంగా ఆయనలో మార్పు అనేది వస్తుంది. అలా చక్కటి అభినయం కనబరిచి సూపర్ స్టార్ రజనీకాంత్..తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.ఇక ఈ ఫిల్మ్ లో నటించినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కు అప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం రూ.1,000. కమల్ హాసన్ ఇంకా జయప్రదలు ఇందులో నటించారు. 1976 వ సంవత్సరంలో విడుదలైంది ఈ సినిమా. కాగా, ఈ మూవీ కంటే ముందే రజనీకాంత్ తమిళ్, కన్నడ భాషలలో నటించారు. 'అపూర్వ రాగంగళ్' అనే తమిళ్ ఫిల్మ్ తో పాటు ఇంకా 'కథ సంగమ' అనే కన్నడ సినిమాలో సహాయ పాత్రలు పోషించారు రజనీ. సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం 'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: