పవన్ కళ్యాణ్ దర్శకుడితో రామ్ పోతినేని సినిమా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన వేణు శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్ హీరోగా హన్సిక హీరోయిన్ గా శృతి హాసన్ కీలక పాత్రలో తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ మూవీ ద్వారా వేణు శ్రీరామ్ దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.


సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న వేణు శ్రీరామ్ , నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఏం సి ఏ మూవీ ని ఎక్కించాడు ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. వేణు శ్రీరామ్ ఆకారుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన వఖిల్ సబ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.  ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.


కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించడం కష్టమే అని తెలుస్తోంది. దానితో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను మరో హీరోతో  తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రామ్ పోతినేని ని ఈ సినిమాకు హీరోగా సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో దిల్ రాజు సూచన మేరకు వేణు శ్రీరామ్ రామ్ పోతినేని కి ఐకాన్ కథను వినిపించగా దానితో రామ్ పోతినేని కి దర్శకుడు వేణు శ్రీరామ్ కి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులను చేయమని చూపించినట్లు,  ప్రస్తుతం ఆ మార్పులు చేర్పులను దర్శకుడు వేణు శ్రీరామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: