టాలీవుడ్ సెన్సేషనల్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే.ఇక ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆృతతగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఈ చిత్ర ట్రైలర్ తో కాస్త రిలీఫ్ ఇచ్చారు చిత్ర యూనిట్ వారు.జూలై 21 వ తేదీన ఈ చిత్ర ట్రైలర్ ను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ ను ఫుల్టూ యాక్షన్ ప్యాక్డ్ గా పూరీ కట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండటం.. విజయ్ దేవరకొండను పూర్తిగా బాక్సర్ గా మార్చేసిన విధానం అద్భుతంగా ఉండటంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ ను బాగా షేక్ చేస్తోంది. అయితే కొంతమందికి మాత్రం నచ్చట్లేదు.
ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తుండటంతో, ఈ చిత్ర ట్రైలర్ ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇంకా అలాగే మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 50 మిలియన్ కు పైగా వ్యూస్ రావడంతో రౌడీ స్టార్ క్రేజ్ ఎలా ఉందో యావత్ ఇండియా కూడా చూస్తోంది.ఇంకా లైక్స్ వ్యూస్ తో బాగా దూసుకుపోతుంది.నెగటివ్ కామెంట్స్ వస్తున్న యూట్యూబ్ లో ఫైర్ బ్రాండ్ లాగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. కాగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇక ఈ అంచనాలను మరింత పెంచేసింది లైగర్ ట్రైలర్. ఆగస్టు 25 వ తేదన ఈ సినిమాతో ఇండియా ఎలా షేక్ అవుతుందో చూడాలి.