దేవుడి పైన భారం వేస్తున్న రష్మిక.. కారణం..?

Divya
నేషనల్ క్రష్ బ్యూటీ గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన కెరియర్ పైన దృష్టి పెట్టి బాగా దూసుకుపోతోంది వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ఉన్నది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అందానికి అందం టాలెంట్ ఉండడంతో రష్మిక ప్రస్తుతం ఉత్తరాదిన కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతులో నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా సినిమా షూటింగ్ అవుతూ ఉండంగానే మరికొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి.


ముందుగా బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్లో రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ప్రాజెక్ట్ డిలే అయింది. ఇక ఈ నేపథ్యంలోనే లెజెండరీ నటుడు ఆయన బిగ్ బి అమితాబచ్చన్ సినిమాలు నటించింది దీంతో హిందీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రష్మిక తో పాటు నీనా గుప్త, సునీల్ గ్రోవర్ తదితరులు తీవ్రతమైన పాత్రలో నటిస్తున్నారు. వికాస్ బహల్ డైరెక్షన్లో గుడ్ బై చిత్రం లో నటిస్తోంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. అమితాబచ్చన్ రష్మిక పాప్కాన్ తింటూ ఉన్నట్లుగా ఫోటో కనిపిస్తోంది. అమితాబ్ సీరియస్ గా టీవీ పైపు దృష్టి మళ్లించాగా.. రష్మిక మాత్రం పాప్ కార్న్ తింటూ ఉండడం మనం గమనించవచ్చు. మిగిలిన కుటుంబ సభ్యులు అంతా మ్యాచును ఆహ్వానలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఓ కదా చిత్రీకరించడం జరిగింది. కుటుంబ బంధాలు బాగోద్వేగాలు ఈ సినిమాలో చూపించడం జరుగుతోందట. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక పాత్ర హైలెట్గా నిలవనుంది. ఇక రస్మిక పోస్ట్ చేస్తూ నువ్వు ఈ సినిమాలో నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావో దేవుడికే తెలుసు.. నువ్వు గర్వించేలా నటించానని నేను నమ్ముతున్నాను.. నీనా గుప్తాను మిస్ అవుతున్నాను. ఇంకా ఎందరినో మిస్ అవుతున్నాను.. త్వరలో సినిమా చూడడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఒక పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: