ఇక సినిమా ఇండస్ట్రీ లో రికార్డు లు నమోదు అవ్వడం కొత్త కాదు. ప్రతి రోజు కూడా ఏదో ఒక రికార్డు నమోదు అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆ రికార్డును మరొక సినిమా బ్రేక్ చేయడం కూడా జరుగుతూనే ఉంటుంది. కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ ఇక అలా ఉండి పోతాయి. ఇక అటువంటి రికార్డులు టాలీవుడ్ లో కొన్నే ఉన్నాయి. ఇలా ఎప్పటికీ బ్రేక్ అవ్వని రికార్డుల్లో ఒక రికార్డు గురించి ఇప్పుడు మనం చూద్దాం. అప్పట్లో సినిమాలు వంద రోజులు ఆడటం అనేది చాలా కామన్ విషయం. అప్పట్లో కొన్ని సినిమాలు మూడు నాలుగు సార్లు విడుదల చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.అవి మొదటి సారి విడుదల అయినప్పుడు మాత్రమే వంద రోజులు ఆడుతాయి. కానీ రీ రిలీజ్ అయ్యి వంద రోజులు ఆడిన సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒకే ఒక్కటే.ఇక ఈ హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యిన ఏడాది తర్వాత సెకండ్ రిలీజ్ అయ్యి వంద రోజులు ఆడింది.
అదే నాగ చైతన్య నటించిన 100% లవ్ సినిమా. 2011 వ సంవత్సరం మే 6న విడుదల అయిన ఆ సినిమా సరిగ్గా ఏడాది కి మళ్లీ ఒక థియేటర్ లో విడుదల అయ్యి ఏకంగా వంద రోజులు ఆడింది.ఇక ఇలాంటి ఒక రికార్డు కేవలం ఈ సినిమా కు మాత్రమే దక్కింది. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్గ్ గా 100% లవ్ సినిమా నిలిచింది. చాలా ఏరియాల్లో కూడా వంద రోజులు ఆడింది. ఏడాది తర్వాత ఖమ్మం వినోద థియేటర్ లో ఈ సినిమాను సెకండ్ టైం రిలీజ్ చేశారు. 2012 వ సంవత్సరంలో 100 % లవ్ సినిమా సెకండ్ రిలీజ్ అయ్యింది. వంద రోజులు కూడా రెగ్యులర్ గా షో లు పడేవి ఇంకా టికెట్లు తెగేవి. ఇక ఖమ్మం వినోద థియేటర్ లో ఈ సినిమా దక్కించుకున్న రికార్డు ఇండియన్ సినీ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఏ సినిమా కూడా ఇలాంటి ఘనత దక్కించుకుని ఉండదు.