DJ టిల్లు 2 ఆ డైరక్టర్ ఎగ్జిట్.. ఈ డైరక్టర్ ఎంటర్..!
క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే విమల్ కృష్ణ ఆ సినిమా నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. డీజే టిల్లు 2 సినిమాకు కూడా సిద్ధు జొన్నలగడ్డనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమాని కొత్త దర్శకుడు మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. తేజా సజ్జా హీరోగా శివాని హీరోయిన్ గా నటించిన అద్భుతం సినిమాని డైరెక్ట్ చేశారు మల్లిక్ రాం. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు సూపర్ హిట్ మూవీ సీక్వల్ డీజే టిల్లు 2 సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు మల్లిక్ రాం. సిద్ధు జొన్నలగడ్డ ఈ సీక్వల్ కథని కూడా చాలా క్రేజీగా రాసినట్టు తెలుస్తుంది. అయితే డీజే టిల్లు పై అంచనాలు లేవు ఆడియెన్స్ కి ఫుల్ ఎంటర్టైన్ అందించాడు. డీజే టిల్లు 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అది అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. తప్పకుండా డీజే టిల్లు మీద దర్శకుడి ముద్ర అనేది ఉంటుంది. మరి ఈ డైరక్టర్ మార్పు అన్నది సినిమా రిజల్ట్ మీద చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.