వైరల్ అవుతున్న దిశా పఠాని వ్యాఖ్యలు...!!

murali krishna
ఆమె స్క్రీన్ మీద కనపడితే ఫ్యాన్స్ అందరూ చెలరేగిపోతారు! ఆమె అందానికి అందరూ కూడా ముగ్దులు అవుతారు ఆమె బాలీవుడ్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు.


ఆమె ఫొటోలు అయితే ఫ్యాన్స్ కు తెగ మత్తెక్కిస్తాయి. తెరపై అత్యంత అందంగా కనిపించే భామగా ఆమెకు పేరు! ఆమె కోసమే థియేటర్లకు క్యూ కట్టే జనాలూ కూడా ఉన్నారు. సినిమాలతో వచ్చిన గుర్తింపుతో సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్ ఆమె! ఇంత ఎందుకు చెబుతున్నావు అంటారా, అక్కడికే వస్తున్నా


మనం మొహం ఎలా వున్నా మనం అద్దం లో చూసుకుని మురిసి పోతాము.కాని ఆమె స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం అస్సలు నచ్చదు అంటుంది ఆ హీరోయిన్ దిశా పఠాని ,ఒక టాక్ షో లో ఈ హీరోయిన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందట.. వెండి తెరపై తనను తను చూసుకోవడం చాలా కష్టం అని, ఆ అనుభవం తను కోరుకోనిది అని ఈ హీరోయిన్ అంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెరపై తనను తాను చూసుకోవడం తనకు చాలా కష్టం గా కోపం గా వుంటుందట.


ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరోయిన్ ఈ తరహాలో స్టేట్ మెంట్ ఇవ్వడం విచిత్రమే. సాధారణంగా ఇలా తెరపై కనిపించే వారికి తమను చూసి తాము తెగ మురిసి పోతారు. అందరు హీరోలకూ, హీరోయిన్లకు ఇలాంటి అలవాటు వుంటుంది.. తమ సినిమాలు హిట్టయ్యే కొద్ది, తమకు డిమాండ్ పెరిగే కొద్దీ ఇలాంటి అలవాటు ఎక్కువ అవుతుంది.. ఆ దశలోనే వారు తాము సాధారణ మనుషుల్లాంటి వాళ్ల కాదనే భ్రమలో కూడా వుంటారు.మరి ఇలాంటి ఫీల్డ్ లో పని చేస్తున్న దిశా మాత్రం తన ప్రజెన్స్ ను తను ఇష్టపడనంటూ, తెరపై తనకు తాను నచ్చనంటూ చెబుతోంది. కాస్త డిఫరెంట్ స్టేట్ మెంటే! ఇలా ఎందుకు అంటుందో మరి.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: