టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన
నాగ చైతన్య తాజాగా థాంక్యూ
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా జులై 22 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ
సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అలాగే
నాగ చైతన్య హిందీ లో లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ
సినిమా ప్రమోషన్ లలో భాగంగా
నాగ చైతన్య ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలో
అమీర్ ఖాన్ హీరోగా నటించగా
కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో
నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ
మూవీ తో పాటు దూత అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా
నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి
విక్రమ్ కె
కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న
నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాలో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో
నాగ చైతన్య సరసన కృతి శెట్టి
హీరోయిన్ గా నటించబోతోంది.
ఇది ఇలా ఉంటే
నాగ చైతన్య , వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కే
మూవీ తో పాటు
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో కూడా నటించబోతున్నట్లు అనేక వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే
నాగ చైతన్య ప్రస్తుతానికి
పరశురామ్ మూవీ ని పక్కన పెట్టి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ పైనే ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే
సినిమా పూర్తి అయిన తర్వాత
నాగ చైతన్య ,
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.