తాజాగా
నాగచైతన్య హీరోగా
విక్రమ్ కె
కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ
సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాకు కలెక్షన్లు ఆశాజనకంగా లేకపోవడంతో
చైతన్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు సైతం థాంక్యూ సినిమాకు మైనస్ అయ్యాయి. అయితే ఇక థాంక్యూ మూవీలో స్టార్
కమెడియన్ సునీల్ సీన్లను డిలీట్ చేశారని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.కాగా సినిమా నిడివి ఎక్కువ కావడంతో
సునీల్ కు సంబంధించి కీలక సన్నివేశాలు
సినిమా నుంచి కట్ అయ్యాయని బోగట్టా.
ఇదిలావుంటే ఈ
సినిమా ఒరిజినల్ రన్ టైమ్ 165 నిమిషాలు అని ఒరిజినల్ రన్ టైమ్ నుంచి 36 నిమిషాల సన్నివేశాలను
సినిమా నుంచి కట్ చేశారని తెలుస్తోంది.కాగా
విక్రమ్ కె
కుమార్ స్పందించి వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ ఇవ్వాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే థాంక్యూ సినిమాను ఎక్కువ నిడివితోనే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని సినిమాను హడావిడిగా ముగించారనే
భావన కలుగుతోందని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంచితే థాంక్యూ సినిమాకు ఎంతగా ప్రమోషన్స్ చేసినా ఈ
సినిమా పుంజుకునే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు పరశురామ్, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలతో
నాగచైతన్య ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.ఇకపోతే ఒక్కో సినిమాకు
చైతన్య 10 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. కాగా నటుడిగా మాత్రం థాంక్యూ చైతూకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇదిలా వుండగా మరోవైపు
హీరోయిన్ రాశి ఖన్నాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇకపోతే థాంక్యూ సినిమాతో
రాశి ఖన్నా ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే...!!