ఒక హీరో కోసం సిద్ధం చేసిన కథలో మరో హీరో నటించడం సాధారణంగా జరుగుతునే ఉంటుంది. అయితే ఇక కొన్ని కథలు మాత్రం అందరు హీరోలకు సూట్ అయ్యే విధంగా ఉంటాయి.ఇదిలావుంటే టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన శరత్ మండవ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇకపోతే రామారావు ఆన్ డ్యూటీ నాగార్జున రిజెక్ట్ చేసిన కథ అని ఆయన తెలిపారు.అయితే రామారావు ఆన్ డ్యూటీ కథ నాగార్జునకు ఎంతగానో నచ్చిందని అయితే నాగార్జున అప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని శరత్ చెప్పుకొచ్చారు.
కాగా యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశానని ఆయన కామెంట్లు చేశారు. ఇక హీరోను దృష్టిలో ఉంచుకుని తాను ఈ కథను సిద్ధం చేయలేదని అయితే స్టార్ హీరో నటిస్తే మాత్రమే బాగుంటుందని భావించానని శరత్ మండవ అన్నారు.ఇకపోతే ఆ తర్వాత ఇదే కథతో రవితేజను సంప్రదించగా రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన తెలిపారు.ఇదిలావుంటే రవితేజకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన కామెంట్లు చేశారు. అయితే రవితేజ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా డైలాగ్స్ ను రాశామని ఆయన తెలిపారు.
ఇక శరత్ మండవ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే మరి నాగ్ రిజెక్ట్ చేసిన కథతో రవితేజ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.కాగా రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. అంతేకాదు రవితేజ కెరీర్ ను కూడా డిసైడ్ చేసే సినిమాలలో ఈ సినిమా ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే తర్వాత ప్రాజెక్ట్ లతో రవితేజ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు...!!