చిరు 154 లో ఇరగదీసే లెవెల్ లో మాస్ రాజా రోల్!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాస్ మసాలా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను నిర్ణయించారు. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారు. ఇప్పటివరకైతే పలు టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత దీనికే అందరూ ముగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. మరి చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ మసాలా పాత్రలో కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఆచార్య సినిమా భారీ పరాభవం తరువాత ఆయన మూడు సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాను పూర్తి చేశాడు. దసరా కానుక కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న బోలా శంకర్ సినిమా కూడా దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇది కూడా మాస్ మసాలా చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తూ ఉండడం విశేషం.

 ఇక బాబీ దర్శకత్వంలోని సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తూ ఉండగా ఈ బోలా శంకర్ సినిమాను సంక్రాంతి సందర్భంగా కానీ క్రిస్మస్ సందర్భంగా కానీ విడుదల చేయడానికి చూస్తున్నారు. అలా బాబీ దర్శకత్వంలో రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన పాత్ర వేరే లెవెల్ మాస్ రేంజ్ లో ఉండబోతుందట. మరి ఈ సినిమాకు ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి. ఈ చిత్రం లో శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: