రామారావు ఆన్ డ్యూటీ: బుకింగ్స్ ఓపెన్.. కేవలం వాటిల్లోనే?

Purushottham Vinay
ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి' ఇంకా అలాగే 'రవితేజ టీం వర్క్స్' బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రజిషా విజయన్ ఇంకా దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో అయిన వేణు కూడా ముఖ్య పాత్రలో నటించాడు.టీజర్, ట్రైలర్ ఇంకా అలాగే పాటలు ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడేలా చేశాయి. ఒక ప్రభుత్వ అధికారిగా రవితేజ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. 'సర్కారు వారి పాట', 'మేజర్' సినిమాల తరువాత తెలుగులో ఓ సూపర్ హిట్ పడి 50 రోజులు దాటింది. ఆ ముచ్చట 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో తీరుతుంది అని అంతా కూడా భావిస్తున్నారు. ఈ చిత్రంతో థియేటర్లు కళకళలాడాలి అని అంతా కూడా ఆశిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో కూడా 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ టీం అత్యాశకు కాకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు అనిపిస్తుంది.



ఇక మల్టీ ప్లెక్స్ లలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అవి కూడా కొన్ని మల్టీ ప్లెక్స్ లలోనే ఈ వీకెండ్ దాకా ఓపెన్ అయ్యాయి. ఇక హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో మొత్తం రూ.190 టికెట్ రేటు ఉంది.ఏ ఎం బి లో తప్ప మిగిలిన అన్ని మల్టిప్లెక్స్ లలో కూడా ఇక ఇవే ధరలు ఉంటాయి. సింగిల్ థియేటర్ లో కూడా సాధారణ రేట్లకే అమ్ముతున్నారు.జనాలు థియేటర్ కు రావడం తగ్గించేశారు అన్న విషయాన్ని గ్రహించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ యూనిట్ మంచి నిర్ణయమే తీసుకుంది.ఇక ఇంకా చెప్పాలి అంటే తెలివైన నిర్ణయం తీసుకుంది అని కూడా చెప్పాలి.టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉంచితే సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: