దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా , ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించగా , సముద్ర ఖని, అజయ్ దేవ్ గన్, శ్రేయ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన తెలుగు తో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 11 వందల కోట్లకు పైగా కలెక్షన్ ను కొల్లగొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొంత కాలం నుండే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వర్షన్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ మరో రికార్డ్ ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ కంటిన్యూ గా పది వారాల నుండి ట్రెండింగ్ అవుతున్న నాన్ ఇంగ్లీష్ మూవీ గా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో రికార్డ్ ని సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కొత్త రికార్డ్ ని సృష్టించింది.