అందులో భాగంగా తెలుగు లో కూడా
బిగ్ బాస్ రియాలిటీ షో ను మొదలు పెట్టారు. తెలుగు లో కూడా
బిగ్ బాస్ రియాలిటీ షో కు బుల్లితెర అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పటికే
బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా 5 సీజన్ లను పూర్తి చేసుకుంది. ఈ 5 సీజన్ లలో మొదటి సీజన్ కి
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడవ , నాలుగవ , ఐదవ సీజన్ లాలూ
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. అలాగే
బిగ్ బాస్ 'ఓ టి టి' మొదటి సీజన్ కు కూడా
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే
బిగ్ బాస్ సీజన్ 6 లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా
టాలీవుడ్ కింగ్ అక్కినేని
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతునట్లు సమాచారం. బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమో షూటింగ్ ను కూడా తాజాగా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో షూటింగ్
అన్నపూర్ణ స్టూడియోలో ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే
బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.