ఆ కారణంగా
కార్తికేయ 2
మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కార్తికేయ 2
మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా , అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను గతంలో జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ
సినిమా విడుదల తేది దగ్గర కు వచ్చిన సమయంలో ఈ
సినిమా విడుదల తేదీని
మూవీ యూనిట్ మార్చింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జులై 22 వ తేదీన ఈ
మూవీ ని విడుదల చేసే ఉద్దేశంతో చాలా రోజుల క్రితమే ఈ
సినిమా ట్రైలర్ ని
మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా నుండి మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిఖిల్ సోషల్
మీడియా వేదికగా 'కార్తికేయ 2'
మూవీ కి సంబంధించిన రెండవ ట్రైలర్ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. మరి
కార్తికేయ 2
మూవీ రెండవ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.