శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా గౌరీ రొనంకి దర్శకత్వం లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన పెళ్లి సందD మూవీ పోయిన సంవత్సరం 15 అక్టోబర్ 2021 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే .
మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రావడానికి చాలా సమయం తీసుకుంది . కొన్ని రోజుల క్రితం నుండే ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది . 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బుల్లి తెరపై కూడా ప్రసారం అయ్యింది. ఈ సినిమా జీ తెలుగు లో తాజాగా ప్రసారం అయ్యింది.
మొదటి సారి బుల్లి తెరపై పెళ్లి సందD సినిమా ప్రసారం అయినప్పుడు 8.62 'టి ఆర్ పి' ని సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే పెళ్లి సందD మూవీ మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు అభిమానుల నుండి మంచి ఆదరణ దక్కింది అని చెప్పవచ్చు. ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ ల పై నిర్మించిన పెళ్లి సందD మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.