ఇక బ్రాండింగ్ కోసం టాప్ కంపెనీలన్నీ కూడా సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, విజయ్ చుట్టే తిరుగుతున్నాయి. ఈ స్టార్ హీరోలు ప్రొడక్ట్ గురించి ఒక్క మాట చెబితే చాలు, చిన్న యాడ్ చేస్తే చాలు టర్నోవర్ కొన్ని కోట్లలో పెరుగుతుందని కోట్లు ఖర్చుపెట్టి మరీ ఈ యాడ్స్ అనేవి చేయిస్తున్నారు.టాలీవుడ్ లో బ్రాండ్ ని ఎండార్స్ చేసే స్టార్లు ఎంత మందున్నా కూడా ప్రస్తుతం టాప్3 లో ఉండేది మాత్రం సూపర్ స్టార్ మహేష్, బన్నీ, విజయ్ మాత్రమే. బ్రాండింగ్ విషయంలో ఈ ముగ్గురిలో చాలా పెద్ద గట్టిపోటీనే జరుగుతోంది.ఒక పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ని రకాల యాడ్స్ చేస్తూ ఇంకా అలాగే బాలీవుడ్ కి సంబంధించినవి కూడా చేస్తుంటే, విజయ్ దేవరకొండ ఎక్కువగా క్లాతింగ్ ఇంకా స్టైలింగ్ బ్రాండ్స్ కే సైన్ చేస్తున్నారు. వీరిద్దరికి ఎప్పట్నుంచో యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల బన్నీకి పుష్ప తర్వాత క్రేజ్ బాగా పెరగడంతో పలు కంపెనీలు బన్నీ వైపు పరిగెడుతున్నాయి. ఇటీవల వరుసగా జొమోటో, ర్యాపిడో ఇంకా అలాగే శ్రీ చైతన్య కాలేజీలు బన్నీతో యాడ్స్ చేయించాయి.
దీనికి బన్నీ రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా తాజాగా బన్నీ మరోసారి వరుసగా యాడ్స్ చేస్తున్నారు.ఇక బన్నీ ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో యాడ్ షూట్ చేశాడు. అయితే అది దేనికి సంబంధించింది అని ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో బన్నీ ఇంకో యాడ్ చేస్తున్నాడు. ఇంకా దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇలా యాడ్స్ మీద కూడా బాగా కాన్సంట్రేట్ చేసి, వాటిని కూడా ప్రమోట్ చేస్తూ మరిన్ని యాడ్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారు స్టార్ హీరోలు. ఈ యాడ్స్ చేయడం పక్కనపెడితే ఇటీవల కొన్ని యాడ్స్ వివాదాస్పదం కూడా అవుతున్నాయి. దీంతో మహేష్, విజయ్, బన్నీ ఇప్పుడు యాడ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నారు.అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో మాత్రం ఈ ముగ్గురు హీరోలు పోటీ పడి మరీ రకరకాల బ్రాండింగ్స్ కి ప్రమోషన్ చేస్తున్నారు.