తనకి ఇష్టమైన ఫోటో ఇదే అంటూ షేర్ చేసిన సూపర్ స్టార్..!!
అలా ఫోటోను షేర్ చేస్తూ రజనీకాంత్ తనకు ఇష్టమైన ఇండోర్ గేమ్స్ లో అత్యంత ఇష్టమైన గేమ్ గా తెలియజేశారు. చెస్ ఒలంపియాడ్ 2002లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రజనీకాంత్ షేర్ చేసిన ఈ ఫోటోకు దాదాపుగా కొన్ని లక్షల మంది రియాక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ ఇప్పుడు అప్పుడు కూడా ఒకేలాగా ఉన్నారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా ఆయన సింప్లిసిటీ ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అంటూ కొంతమంది అభిమానులు సైతం వీటికి రిప్లై ఇస్తున్నారు ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కొంతమేర షూటింగ్ కూడా త్వరలోనే హైదరాబాదులో జరగబోతోంది అన్నట్లుగా సమాచారం. ఇక అభిమానులు సైతం రజనీకాంత్ కి ఏదైనా సరైన విజయం అందించే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి రజనీకాంత్ జైలర్ సినిమా తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.