వేణు తొట్టెంపూడి ...మనందరికి తెలిసిందే.ఇక స్వయంవరం సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వేణు.. కాగా ఆ తరువాత చెప్పవే చిరుగాలి, పెళ్ళాం ఊరెళితే ,హనుమాన్ జంక్షన్ తదితర సినిమాలలో నటించి మంచి నటుడుగా పేరుపొందాడు.అంతేకాదు ముఖ్యంగా ఫ్యామిలీ
ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు ఈ హీరో. అయితే ఇక కొన్ని అనివార్య కారణాలవల్ల దాదాపుగా తొమ్మిది సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీకి దూరం ఉన్న తొట్టెంపూడి వేణు..ఇదిలావుంటే తాజాగా
రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ
సినిమా ద్వారా
పోలీస్ ఆఫీసర్గా మళ్లీ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
పోతే ఈ
సినిమా విడుదల సందర్భంగా ఈ
సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వేణు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది.అయితే అప్పట్లో తన సహనటుడు అయిన
సునీల్ తో తన కాంబినేషన్ కిమంచి హిట్ టాక్ ఉండేది అని తెలిపారు.ఇక పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి ,కళ్యాణ రాముడు వంటి సినిమాలలో మా ఇద్దరి
కామెడీ బాగా ఆకట్టుకుంది.అయితే ఇద్దరి
కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేది.. నేను తొమ్మిది సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యాను ఈ సమయంలోనే
సునీల్ హీరోగా హిట్ కొట్టడం ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు సినిమాలలో నటించడం వంటివి జరిగింది.
కాగా తనకు
సునీల్ మంచి మిత్రుడు కూడా అని తెలియజేశారు.అంతేకాదు అప్పట్లో
సునీల్ మాట్లాడితేనే ప్రతి ఒక్క ప్రేక్షకులకు నవ్వు వచ్చేది .అయితే ఇక ఇప్పుడు
సునీల్ కామెడీ చేయడం లేదు. పోతే కేవలం విలన్ గా ,హీరోగా మాత్రమే చేస్తున్నారు. ఇక ఈ విధంగా అయితే
సునీల్ నటించాలి కానీ
కమెడియన్ గా నటించాల్సిన అవసరం లేదు. తాను మాట్లాడితే చాలు ప్రతి ఒక్క ప్రేక్షకులు నవ్వుతూ ఉంటారు.అయితే అందుకే నాకు అప్పటి
సునీల్ అంటేనే చాలా ఇష్టము ఇప్పుడు
సునీల్ నాకు నచ్చలేదు అని తెలిపారు. ఇకపోతే కానీ తను డిఫరెంట్ పాత్రలలో నటించడం తనకు బాగా అనిపించింది అని తెలిపారు. అలా
సునీల్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు...!!