ఇక
టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్
సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఎప్పుడు నుంచో ఇండస్ట్రీలో ఉన్న తాను ఇప్పుడు పాన్
ఇండియా ప్రొడ్యూసర్ గా కూడా మారాడు.అయితే దిల్ రాజు ఇప్పటి వరకు కూడా ఎన్నో సినిమాలు చేశాడు కానీ ఈ ఏడాది ఎదుర్కున్న నష్టాలు మాత్రం అసలు అన్ని ఇన్ని కావు.కేవలం ఎదో ఒకటి రెండు అంశాల్లో సేఫ్ అయ్యాడు తప్ప ఇక మిగతా సినిమాల్లో మాత్రం భలే నష్టాలు తప్పలేదు. మరి ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏమో కానీ లేటెస్ట్ గా తన చర్యలు చూసి
ఇండస్ట్రీ వర్గాల వారు కూడా షాకవుతున్నారు.
టాలీవుడ్ యంగ్
హీరో నిఖిల్
కార్తికేయ 2 సినిమాని రిలీజ్ చేయనివ్వకుండా ఆపుతుండడం థియేటర్స్ మీకు దక్కవు అని బెదిరించడం వంటి షాకింగ్ అంశాలు
టాలీవుడ్ లో చాలా కలకలం రేపాయి.ఇంకా అలాగే
టాలీవుడ్ లో నిన్న ఆగస్ట్ 1 వ తేదీ నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేయాలి అని ఫిక్స్ అవ్వగా అన్ని సినిమాలు ఆపారు కానీ తాను నిర్మిస్తున్న “వారసుడు”
తమిళ్ లో “వరిసు”
సినిమా మాత్రం ఆగలేదు.
మరి దీనికి కారణం ఏంటి బాబు
అని అడిగితే ఇది తెలుగు
సినిమా కాదు
తమిళ్ సినిమా అంటూ తల
తిక్క సమాధానం ఇచ్చి దిల్ రాజు షాకిచ్చాడు.అసలు ఈ సినిమాతోనే
తమిళ స్టార్
విజయ్ దళపతి తెలుగులో అందులోని తెలుగు డైరెక్టర్
వంశీ పైడిపల్లితో ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా భారీ తెలుగు తారాగణం కూడా నటిస్తున్నారు. దీనితో ఈ
సినిమా ఎలా తెలుగు
సినిమా కాదు? పైగా ఇది రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న
సినిమా అని కూడా తెలిపారు.ఇప్పుడు చూస్తే దిల్ రాజు తనకి కన్వీనెంట్ గా ఇలా మార్చేసుకోవడం అందరికీ పెద్ద షాకిచ్చింది. దీనితో దిల్ రాజు కన్నింగ్ మైండ్ ఏంటో అందరికీ అర్ధం అవుతుంది అని
నెటిజన్స్ లో రక రకాల మాటలు వినిపిస్తున్నాయి. అసలు దిల్ రాజు తీరు ఎలా ఉందంటే మన ఇంట్లో దీపాలు వెలగడం కోసం పక్కింట్లో దీపాలు ఆర్పేద్దాం అన్నట్లు వుంది. ఇక దిల్ రాజు తన మాఫియా చేష్టలు మానుకోపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం వుంది.