సమంతకు షాక్ ఇస్తున్న చైతన్య సమాధానం !
ఇప్పుడు ఈవిషయమై నాగచైతన్య వంతు వచ్చింది. ఈనెల రెండవ వారంలో విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ప్రమోట్ చేస్తూ నాగచైతన్య సమంత విషయమై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. భవిష్యత్ లో చైతన్య సమంత తో కలిసి నటిస్తాడా అన్న ప్రశ్నకు చైతూ చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు.
'ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో తనకు తెలియదు కానీ రేపు ఏమి జరుగుతుందో తనకు తెలియదు అని అంటూ ఈవిషయమై తాను ఎక్కువగా ఆలోచించను అంటూ కామెంట్ చేసాడు. చైతూ కూల్ గా ఇచ్చిన ఇలాంటి సమాధానంతో భవిష్యత్ లో చైతన్య సమంత లు తిరిగి నటిస్తారా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఈమధ్య సమంత చైతన్యతో విడిపోయిన తరువాత తామిద్దరూ కలిసి ఉన్న ఒక విల్లాను సమంత ఎక్కువ ధర పెట్టి కొన్నది అని వస్తున్న వార్తలు విన్నవారు వీరిద్దరూ విడిపోయినా ఇప్పటికీ వీరికి ఒకరి పై ఒకరికి అభిమానం ఇప్పటికీ ఉందా అన్న సందేహాలు రావడం సహజం.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే సమంతా చైతన్యలు ‘మజిలీ’ లాంటి ఒక మంచి సినిమాలో మళ్ళీ కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ వీరిద్దరికీ సోషల్ మీడియాలో కొంతమంది సూచనలు కూడ చేస్తున్నారు. లేటెస్ట్ గా చైతన్య నటించిన ‘థాంక్యూ’ ఫెయిల్ అవ్వడంతో ఈ నెలలో రాబోతున్న ‘లాల్ సింగ్ చద్దా’ చైతూ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది..