తాజాగా నందమూరి
బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఇప్పుడు
బాలయ్య వరుస సినిమాలు చేస్తూ బిగుగా ఉన్నారు.అయితే ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో
బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తూ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.అయితే ఇప్పటివరకు ఈ
సినిమా నుండి పోస్టర్స్, టీజర్స్ మాత్రమే రిలీజ్ చేశారు.
ఇకపోతే ఇంకా ఈ
సినిమా టైటిల్‌ను రివీల్ చేయకపోవడంతో
నందమూరి బాలకృష్ణ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇదిలావుంటే తాజాగా
ఇండస్ట్రీ వర్గాల్లో దీనికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.ఇకపోతే బాలయ్య సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని.. ఈ టైటిల్ ను ఈ నెలలో వచ్చే రాఖీ
పండుగ రోజున రివీల్ చేయబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే
నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ టైటిల్ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.కాగా ఈ సినిమాలో
నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడని..
అంతేకాదు ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులకు అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో అందాల
భామ శ్రుతి హాసన్
హీరోయిన్ గా నటిస్తుండగా,
థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.అయితే ఇక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
నందమూరి బాలకృష్ణ ఊరమాస్ అవతారం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇకపోతే మరి
బాలయ్య కెరీర్ లో తెరకెక్కుతున్న 107వ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారో తెలియాలంటే రాఖీ
పండుగ వరకు ఆగాల్సిందే...!!