సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ , సూపర్ హిట్ ,
బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి కేవలం
ఇండియా వ్యాప్తంగా నే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కున్నారు .
ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న
సూపర్ స్టార్ రజనీ కాంత్ గత కొంత కాలంగా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు . కొన్ని రోజుల క్రితమే
సూపర్ స్టార్ రజినీ కాంత్ అన్నాత్తే మూవీ లో
హీరో గా నటించాడు . ఈ
మూవీ చెల్లెలు సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
మూవీ తమిళ ప్రేక్షకులను కాస్త అలరించినప్పటికి , తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ
మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది .
ఈ
మూవీ తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది . ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ మరి కొన్ని రోజుల్లో నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే జైలర్
మూవీ లో హీరోగా నటించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా
సూపర్ స్టార్ రజనీ కాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా తమిళనాడు గవర్నర్ ను కలిసిన రజనీ కాంత్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ... తనకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశాడు. కొంత కాలం క్రితం
రజినీ కాంత్
పార్టీ పెట్టేందుకు సిద్ధంగా కాగా , అనూహ్యంగా తాజాగా ఆ నిర్ణయాన్ని రజనీ కాంత్ వెనక్కి తీసుకున్నాడు.