విజయ్ దేవరకొండ- రష్మీ..పై క్లారిటీ ఇచ్చిన రష్మిక..!!
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ తో ఉన్న రిలేషన్షిప్ గురించి తెలియజేసింది. ప్రజలు మన గురించి చాలా చెత్తగా మాట్లాడుతూ ఉంటారు అయినా వారిని నవ్వించడానికి నేను చాలా ఇష్టపడతానని తెలియజేసింది. ఇక అంతే కాకుండా నేను సంవత్సరానికి ఐదు సినిమాలకు పైగా చేస్తాను మీరు ఇంకా మొదటి సినిమా దగ్గరే ఆగిపోయారు అని తెలియజేసింది. మేము హీరోయిన్స్ కాబట్టి మా గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఆ విషయాన్ని మేము కూడా అర్థం చేసుకోగలము. కానీ ఇది కెరియర్ ప్రారంభం నుంచి ఇలాగే ఉన్నది .
ఇక అంతే కాకుండా ఆమె ఎవరిని చూస్తోందో ఏ వ్యక్తితో ఉంటుందో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇది నటీనటుల లైఫ్ కాబట్టి ఇలానే ఆలోచిస్తారని తెలియజేసింది. కానీ తన విషయానికి వస్తే మాత్రం నా విషయంలో నేను చెప్పే వరకు ఎలాంటి విషయాన్ని నమ్మవద్దని తెలియజేస్తుంది. ఇక విజయ్ కూడా కాఫి విత్ కరణ్ షోలో రష్మిక నేను మంచి స్నేహితులం మేమిద్దరం షూటింగ్ సమయంలో బాగా స్నేహితులమయ్యాము అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలిపారు.