మహేష్ బాబు కి మాత్రమే సొంతమైన ఈ అరుదైన రికార్డ్ ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు రోజురోజుకు ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే మహేష్ బాబు తను నటించిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారనే సంగతి తెలిసిందే.ఇదిలావుంటే ఇక తాజాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ నటించిన పోకిరి మూవీ రీ రిలీజ్ కావడంతో పాటు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ఇకపోతే మహేష్ బాబుకు క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక  ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయనే సంగతి తెలిసిందే.కాగా  మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను ఓవర్సీస్ లో సొంతం చేసుకున్నాయి. అయితే మహేష్ నటించిన నాలుగు సినిమాలు యూఎస్ లో 2 మిలియన్ గ్రాస్ కలెక్షన్లను అందుకోవడం గమనార్హం.కాగా ఓవర్సీస్ లో మహేష్ కు మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతం కావడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలావుంటే మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ కావడం గమనార్హం.అయితే  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.పోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ కావాల్సి ఉంది. అయితే  సమ్మర్ టార్గెట్ గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఇక  మహేష్ బాబు తర్వాత సినిమాలతో కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: