ఒకే వేదికపై యశ్, పవన్ కళ్యాణ్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక ఆ తరువాత  "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు.ఇదిలావుంటే ఇక తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు.ఇకపోతే  #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే  బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంభందించిన మూడు ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఒక మోషన్ పోస్టర్ ని దుబాయ్ లో లాంచ్ చేయనున్నారు.పోతే  దాన్ని మెగా ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు.

అయితే  #Yash #PawanKalyan లను ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ లుగా కు పిలుస్తున్నట్లు సమాచారం.అంతేకాదు  ఇంకా ఈ విషయమై అఫీషియల్ కన్పర్మేషన్ లేదు. ఇకపోతే రామ్ చరణ్ మార్క్ మాస్ సినిమా రచ్చకు ఇది కేవలం టీజర్ అంటున్నారు.అయితే రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకూ 'విశ్వంభర', 'సర్కారోడు' అనే టైటిల్స్‌ వినిపించాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: