ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసిహీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.అయితే దర్శకధీరుడు రాజమౌళి ఈ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు మరికొన్ని ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు ఈ విజువల్ గ్రాండియర్‌లో నటించారు.
ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొంది .అయితే ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.అంతేకాదు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.ఇదిలావుంటే ఇక చెర్రీ, తారక్‌ల నటన, జక్కన్న టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఆర్ఆర్ఆర్ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. కాగా విడుదలై నాలుగు నెలలవుతున్నా డిజిటల్ స్ర్కీన్‌పై రికార్డు స్థాయి వ్యూస్‌లు వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీవీలో రానుంది. అయితే స్టార్ మా ఛానెల్లో ఈ మూవీ ప్రీమియర్ కానుంది. ఇక ఏ సమయంలో ప్రసారం కానుందన్న విషయంపై ఛానల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజు రాత్రి 8 గంటలకు జీ సినిమాలో హిందీ వెర్షన్ ప్రసారం కానుంది.ఇకపోతే మరి థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేకపోయిన వారు ఎంచెక్కా టీవీలో చూసి ఎంజాయ్ చేయండి..!!