టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ లలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ ఒకటి. ఈ మూవీ కి కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా , శతాధిక చిత్ర దర్శకుడు కీర్తిశేషులు శ్రీ కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి నచ్చావ్ అబ్బాయి అనే లిరికల్ సాంగ్ ను ఆగస్ట్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.