తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తెలుగు తెలుగు పరిచయమయ్యారు నటుడు విజయ్ దేవరకొండ . అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.ఇక ఇలా వరుస సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇకపోతే ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా తెరకెక్కిన లైగర్ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలావుంటే ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.పోతే విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా తన కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.అయితే ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచాయని చెప్పాలి.
కాగా ఇలా మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సుమారు 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో ఈయన తన కెరీయర్ లో ఇప్పటివరకు తీసుకొని అత్యధిక రెమ్యూనరేషన్ ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని చెప్పాలి.అయితే ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తన మార్కెట్ కూడా పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు...!!