జబర్దస్త్ లో ఎన్నో అవమానాలు పడ్డానంటున్న అనసూయ..!!

Divya
ఈటీవీలో జబర్దస్త్ ప్రారంభమై ఇప్పటికి పది సంవత్సరాలు పైనే అవుతోంది. ఈ షో ప్రారంభమైన సమయంలో అనసూయ యాంకర్ గా తీసుకున్నారు ఆ సమయంలో షోకు అద్భుతమైన రెస్పాన్సి లభించింది దీంతో రేటింగ్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ కొంతకాలానికి మళ్లీ తిరిగి అనసూయ జబర్దస్త్ ను వీడడం జరిగింది. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటివరకు జబర్దస్త్ అనసూయ ఒక వెలుగు వెలిగింది. నటిగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు జబర్దస్త్ నుండి దూరం అవ్వడంతో ఆమె పైన పలు వార్తలు బాగా దుమారం రేపాయి.

అ షో కు దూరం అవుతున్న సమయంలో తాను సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతోందన్నట్లుగా ఆమె గురించి పలు కథనాలు వచ్చాయి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ స్పందిస్తూ జబర్దస్త్ లో తను చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నారని కామెడీ పేరుతో తనని చాలా ఇబ్బంది పెట్టారని పలు రకాలుగా కామెంట్ చేస్తున్న ఈ ఫీల్డ్ లో అవన్నీ తప్పదు అన్నట్లుగా భరించానని తెలిపింది అనసూయ. బాడీ షేవింగ్ మొదలుకొని వెకిలి చేష్టలు వంటివి చేయడం తనకి నచ్చవు అని ఎవరైనా నా పైన పంచులు వేసిన ఆ సమయంలో నేను సీరియస్ అవుతాను కానీ వాటిని మాత్రం టెలికాస్ట్ చేయాలని తెలిపింది.

ఎన్నోసార్లు తనమీద పంచులు వేయవద్దని తెలిపిన కూడా జబర్దస్త్ కమెడియన్స్ ఇస్టాను సారంగా పంచులు వేయడంతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేసే వారిని తెలియజేసింది. ఇక నాగబాబు రోజా వెళ్లిపోవడం వల్ల ఈమె కూడా వెళ్ళిపోయిందని వార్తలపై స్పందిస్తూ. ఇలాంటి మాటలు మాట్లాడడం అవివేకం.. వారు వెళ్ళిపోతే నేను వెళ్లిపోవడం కూడా నేనేమైనా గొర్రెల మందకు చెందిన దాన్న అంటూ తెలియజేసింది. నేను జబర్దస్త్ ను గత రెండు సంవత్సరాల క్రితమే వదిలేయాలనుకున్నాను కానీ కొన్ని కారణాల చేత ఇప్పుడు వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: