అందం , అభినయం , నటన ఈ మూడు కలబోసుకున్న ముద్దు గుమ్మలలో ఒకరైన క్యాథరిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఇద్దరమ్మాయిలతో మూవీ తో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్యాథరీన్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇద్దరమ్మాయిలతో
మూవీ మంచి విజయాన్ని అందుకోవడం అలాగే ఈ
మూవీ లో క్యాథరిన్ తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేయాడంతో ఈ ముద్దుగుమ్మకు
ఇద్దరమ్మాయిలతో మూవీ తరువాత మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా క్యాథరీన్ అనేక సినిమాలలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో
హీరోయిన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు
సినిమా అవకాశాలు దక్కించుకోవడం లో కాస్త వెనుకబడిపోయిన క్యాథరీన్ ప్రస్తుతం మాత్రం వరుస మూవీలతో తన అభిమానులను అలరిస్తోంది. కొంతకాలం క్రితం క్యాథరిన్, శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన భళా తందననా
మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.
అలాగే ఈ నెల అనగా ఆగస్ట్ 5 వ తేదీన విడుదలయిన బింబిసార
మూవీ లో క్యాథరీన్
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఇదే నెలలో విడుదల అయిన
మాచర్ల నియోజకవర్గం
మూవీ లో కూడా క్యాథరీన్
హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ
మూవీ కి మాత్రం
బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తీవ్రమైన నెగిటివ్ టాక్ లభించింది. దాంతో ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర హిట్ గా నిలవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఇలా క్యాథరీన్ కి హిట్ దక్కిన సంతోషం ఎక్కువ రోజులు లేకుండానే మరో అపజయం కూడా పలకరించింది.