పాన్
ఇండియా సూపర్ స్టార్ యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాధేశ్యామ్ మూవీతో
ఆడియన్స్ ముందుకు వచ్చిన
డార్లింగ్ ప్రభాస్ ఆ సినిమాతో ఊహించని పరాజయం చవి చూసాడు. అయిన కానీ
ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస పాన్
ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇక ఇప్పుడు చేతిలో అన్ని పాన్
ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలతో తీరిక లేకుండా
ప్రభాస్ గడిపేస్తున్నాడు.అలాగే మరోవైపు
డార్లింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా
కేజీఎఫ్ డైరెక్టర్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ
మూవీ నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . తాజాగా ఇక
డార్లింగ్ అభిమానులకు
గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్..సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది
సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ..
ప్రభాస్ కు సంబంధించిన
పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్లో
ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇక సలార్
సినిమా నుంచి ఈ స్పెషల్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్
ఖుషి అవుతున్నారు. ప్రముఖ
కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాట్
బ్యూటీ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ అనేది
హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. సలార్
సినిమా మాత్రమే కాకుండా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలే వున్నాయి. ఈ
సినిమా ఖచ్చితంగా
బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో భావిస్తున్నారు. చూడాలి ఈ
సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో..