ఈ
మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు పది రోజులు
బాక్స్ ఆఫీస్ రన్ ని సీతా రామం
మూవీ కంప్లీట్ చేసుకుంది.
ప్రేమ కథలను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగిన హను రాఘవపూడి ఈ
మూవీ కి దర్శకత్వం వహించడం, సీతా రామం
మూవీ కూడా ప్రేమకథా చిత్రం కావడంతో ఈ
మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సీతా రామం
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 17 కోట్ల టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ఈ
మూవీ అతి తక్కువ రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని
సక్సెస్ ను అందుకుంది. ఈ
మూవీ పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 24.39 కోట్ల షేర్ , 47.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో పది రోజులకు గాను ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.39 కోట్ల లాభాలను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.