ట్రైలర్: సస్పెన్స్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని హత్య ట్రైలర్..!!

Divya
బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తనకంటూ ఒక గుర్తింపును సంపాదించారు ఇక అప్పటినుంచి తెలుగులో తన సినిమాలను రెగ్యులర్గా విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా హత్య అనే సినిమాకు సంబంధించి ట్రైలర్ను కూడా విడుదల చేశారు ఇందులో విజయ్ ఆంటోని, రితికా సింగ్ ,మీనాక్షి చౌదరి ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రం మర్డర్ మిస్టరీ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఇక టైటిల్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా ఆసక్తికరంగా మారుతోంది.

మీనాక్షి చౌదరి హత్యకు గురైన మోడల్ గా నటించింది. మీనాక్షి హత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా విజయ్ ఆంటోని ,రితికా సింగ్ ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది. ఇక ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ చూడగానే సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తోంది. ట్రైలర్ మాస్టర్ క్లాస్ గా కనిపిస్తుంది అలాగే ఒక పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ మూవీ కి ఏం కావాలో ఆ టెక్నాలజీని ఈ సినిమాలో బాగా ఉపయోగించారని చెప్పవచ్చు ఒక అందమైన మోడల్ హత్య చుట్టూ తిరిగి కదా అంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాకి ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది తన ఖాతాలో వేసుకున్నారని విజయ్ ఆంటోని చెప్పవచ్చు ఇక ఇందులో విజయ్ ఆంటోని మీనాక్షి ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా వీరిద్దరూ ఈ ట్రైలర్లు ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరూ డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని హీరో నాని తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు త్వరలో ఈ సినిమాకు థియేటర్లలో విడుదల కాబోతోందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: